దాదాపు నాలుగేళ్ల తర్వాత కొత్తగా చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో పేదలు, వృద్ధులు, అర్హత ఉన్న కుటుంబాలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇదే అవకాశంగా కొందరు సిబ్బంది వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ సేవను ఉచితంగా అందించాల్సిన సిబ్బంది.. దరఖాస్తు ఆన్లైన్ నమోదుకే డబ్బులు అడుగుతున్నారని పలువురు వాపోతున్నారు.
గ్రామస్థాయిలో దరఖాస్తులు సిద్ధం చేసుకుని మండల కార్యాలయాలకు వస్తున్న వారికి ఆన్లైన్ నమోదు పేరుతో డబ్బులు అడుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని సమాచారం. అధికారికంగా ఎలాంటి రుసుము లేకపోయినా.. దరఖాస్తుదారులు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు చెబుతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో ఒక్కో దరఖాస్తుకు రూ.300, మరికొన్ని చోట్ల రూ.500 వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పింఛన్ వస్తే ప్రతి నెలా ఆర్థిక సహాయం అందుతుందన్న ఆశతో ఉన్న పేదలు.. దరఖాస్తు దశలోనే డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కొక్కరి నుంచి రూ.300, రూ.500 తీసుకోవడం చిన్న మొత్తంగా కనిపించినా.. వందలాది దరఖాస్తులు నమోదైతే అది వేలల్లో, లక్షల్లోకి చేరుతుంది. దీంతో ఇలాంటి అక్రమ వసూళ్లను ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
చేయూత పింఛన్ దరఖాస్తుల కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సిబ్బంది ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే సంబంధిత ఎంపీడీవో లేదా జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఫిర్యాదులు అందితే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















