శ్రావణ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పాటించే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే ఉపవాసం అంటే రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండటమే కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వ్యక్తి వయసు, బరువు, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులను బట్టి ఆహార అవసరాలు మారుతాయి. అందువల్ల అందరికీ ఒకే రకమైన ఉపవాస విధానం సరిపోదు.
వాటర్ ఫాస్టింగ్‌లో నిర్ణీత వ్యవధిలో ఘన ఆహారం తీసుకోకుండా కేవలం నీటినే తీసుకుంటారు. కొంతమందికి తక్కువ వ్యవధిలో ఇది బరువు నియంత్రణలో సహాయపడవచ్చని చెబుతున్నా.. దీర్ఘకాలం స్వయంగా ఆచరించడం సరికాదు. శరీరానికి అవసరమైన కేలరీలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అందకపోతే నీరసం, తలతిరగడం, బీపీ తగ్గడం వంటి సమస్యలు రావచ్చు.
ఉపవాసం ముగిసిన తర్వాత చాలాసేపు ఆకలిగా ఉన్నామని అధికంగా, కొవ్వు లేదా చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం కూడా మంచిది కాదు. ఉపవాసం తర్వాత తేలికపాటి, పోషక విలువలున్న ఆహారంతో ప్రారంభించి.. క్రమంగా సాధారణ ఆహారానికి రావడం మంచిది. పండ్లు, కూరగాయలు, పప్పులు, మిల్లెట్స్ వంటి పోషక పదార్థాలను అవసరానికి అనుగుణంగా తీసుకోవాలి.
మధుమేహం, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయాలనుకుంటే ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, తక్కువ బరువు ఉన్నవారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో మందులు వాడుతున్నవారు స్వయంగా దీర్ఘకాల ఉపవాసాలు చేయకూడదు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















