ప్రస్తుత డేటా ఆధారిత యుగంలో స్టాటిస్టిక్స్‌కు ప్రాధాన్యం గణనీయంగా పెరుగుతోంది. వివిధ రంగాల్లో భారీగా డేటా అందుబాటులోకి వస్తుండటంతో దాన్ని విశ్లేషించి ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకునే నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ చదివిన విద్యార్థులకు ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ మంచి కెరియర్ ఎంపికగా నిలుస్తోంది.
మ్యాథ్స్ చదివిన విద్యార్థులకు గణితపరమైన ఆలోచనా విధానం, సమస్యలను విశ్లేషించే సామర్థ్యం ఇప్పటికే ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ నేపథ్యం ఉన్నవారికి ప్రోగ్రామింగ్, డేటాబేస్, డేటా ప్రాసెసింగ్‌పై అవగాహన ఉంటుంది. ఈ నైపుణ్యాలను స్టాటిస్టిక్స్‌తో అనుసంధానం చేసుకుంటే డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
అయితే ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌లో చేరే ముందు ఆయా విశ్వవిద్యాలయాల ప్రవేశ అర్హతలను పరిశీలించాలి. కొన్ని సంస్థలు డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలని కోరుతుంటే.. మరికొన్ని మ్యాథమెటిక్స్ నేపథ్యం ఉన్న విద్యార్థులకూ అవకాశం కల్పిస్తున్నాయి.
ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌లో ప్రాబబిలిటీ, స్టాటిస్టికల్ ఇన్‌ఫరెన్స్, హైపోథిసిస్ టెస్టింగ్, రిగ్రెషన్, శాంప్లింగ్, మల్టీవేరియేట్ అనాలిసిస్, టైమ్ సిరీస్, ఫోర్‌కాస్టింగ్, ఆపరేషన్స్ రిసెర్చ్, స్టాటిస్టికల్ కంప్యూటింగ్ వంటి అంశాలను అధ్యయనం చేస్తారు. వీటితోపాటు ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంపొందించుకోవడం కెరియర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.
పైథాన్, ఆర్ ప్రోగ్రామింగ్, ఎస్‌క్యూఎల్, అడ్వాన్స్‌డ్ ఎంఎస్-ఎక్సెల్, పవర్ బీఐ, టాబ్ల్యూ వంటి టూల్స్‌పై పట్టు సాధిస్తే ఉద్యోగావకాశాలు మరింత మెరుగవుతాయి. ముఖ్యంగా డేటా క్లీనింగ్, డేటా విజువలైజేషన్, గణాంక మోడలింగ్, మెషిన్ లెర్నింగ్ వంటి నైపుణ్యాలు అదనపు ప్రయోజనాన్ని అందిస్తాయి.
ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తిచేసిన తర్వాత డేటా అనలిస్ట్, స్టాటిస్టికల్ అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, మార్కెట్ రిసెర్చ్ అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్, క్రెడిట్ రిస్క్ మోడలర్ వంటి ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, ఈ-కామర్స్, మార్కెటింగ్, కన్సల్టింగ్ సంస్థల్లో డేటా ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యం పెరుగుతున్నందున ఈ రంగాల్లో అవకాశాలు విస్తరిస్తున్నాయి.
హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో స్టాటిస్టిక్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. బయోస్టాటిస్టీషియన్, క్లినికల్ డేటా అనలిస్ట్ వంటి ఉద్యోగాల్లో స్టాటిస్టిక్స్ నైపుణ్యాలను వినియోగించవచ్చు. క్లినికల్ ట్రయల్స్, ప్రజారోగ్యం, ఎపిడెమియాలజీ, వైద్య పరిశోధన వంటి విభాగాల్లో డేటా విశ్లేషణ కీలకంగా ఉంటుంది.
ప్రభుత్వ రంగంలోనూ స్టాటిస్టిక్స్ విద్యార్థులకు పలు అవకాశాలు ఉన్నాయి. యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కెరియర్ నిర్మించుకోవచ్చు. ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ ద్వారా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులను లక్ష్యంగా పెట్టుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ వంటి పోస్టులు కూడా అందుబాటులో ఉంటాయి.
బ్యాంకింగ్ రంగంలో ఆర్‌బీఐ గ్రేడ్ బీ డీఎస్‌ఐఎం వంటి ప్రత్యేక నియామకాలు కూడా స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామెట్రిక్స్, డేటా సైన్స్ సంబంధిత విద్యా నేపథ్యం ఉన్నవారికి ముఖ్యమైన కెరియర్ మార్గంగా నిలుస్తాయి.
బోధన, పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారు ఎమ్మెస్సీ తర్వాత పీహెచ్‌డీ చేయవచ్చు. అర్హత, నిబంధనలకు అనుగుణంగా సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌లో మ్యాథమెటికల్ సైన్సెస్ విభాగాన్ని లక్ష్యంగా పెట్టుకోవచ్చు. పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో కూడా అవకాశాలను అన్వేషించవచ్చు.
స్టాటిస్టిక్స్‌లో పీజీ పూర్తిచేయడం మాత్రమే కాకుండా పరిశ్రమకు అవసరమైన టెక్నికల్ నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. పైథాన్, ఆర్, ఎస్‌క్యూఎల్‌తోపాటు డేటా విజువలైజేషన్, పవర్ బీఐ, టాబ్ల్యూ, మెషిన్ లెర్నింగ్‌పై అవగాహన పెంచుకోవాలి. రియల్ టైమ్ డేటాసెట్లతో ప్రాజెక్టులు చేయడం, ఇంటర్న్‌షిప్‌లు చేయడం వల్ల ఉద్యోగ ఇంటర్వ్యూల్లో మెరుగైన అవకాశాలు పొందవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















