రాష్ట్రపతి పక్కన కనిపించే ఆర్మీ అధికారి.. 12 ఏళ్లకే రిటైర్మెంట్ ఎందుకు?రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారిక కార్యక్రమాలు, పర్యటనల్లో ఆమె వెంట కనిపించే ఆర్మీ అధికారి మేజర్ రిషభ్ సింగ్ సాంబ్యాల్ చాలామందికి సుపరిచితమే. రాష్ట్రపతి ఎయిడ్-డి-క్యాంప్ (ADC)గా విధులు నిర్వహిస్తూ ప్రొటోకాల్, భద్రతా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించిన ఆయన సామాజిక మాధ్యమాల్లోనూ మంచి గుర్తింపు పొందారు. తాజాగా 12 ఏళ్ల సైనిక సేవ అనంతరం ముందస్తు పదవీ విరమణ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్‌డీఏ నుంచి సైన్యంలోకి..32 ఏళ్ల రిషభ్ సింగ్ 2014లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో చేరారు. మిలిటరీ స్టడీస్, డిఫెన్స్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందారు. అనంతరం ‘4 పారా స్పెషల్ ఫోర్సెస్’లో సేవలందించారు. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మక ‘బలిదాన్ బ్యాడ్జ్’ను పొందారు.
గణతంత్ర పరేడ్‌తో గుర్తింపు..2021 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కెప్టెన్‌గా జాట్ రెజిమెంట్ దళానికి రిషభ్ సింగ్ నాయకత్వం వహించారు. ఆ ఏడాది జాట్ రెజిమెంట్ ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్ ట్రోఫీని గెలుచుకోవడంతో ఆయన పేరు మరింతగా వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రపతి ఏడీసీగా కీలక బాధ్యతలు..2023లో రిషభ్ సింగ్ రాష్ట్రపతి ఏడీసీగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి రాష్ట్రపతి అధికారిక కార్యక్రమాలు, విదేశీ పర్యటనలు, ఇతర ముఖ్య కార్యక్రమాల్లో ఆమె వెంట తరచూ కనిపించారు. ప్రొటోకాల్‌కు అనుగుణంగా తన బాధ్యతలను నిర్వహించడంతో ఆయనపై నెటిజన్ల దృష్టి పడింది. సామాజిక మాధ్యమాల్లో ఆయనకు ప్రత్యేకంగా అభిమానులు ఏర్పడి ‘నేషనల్ క్రష్’ అంటూ పిలవడం కూడా మొదలైంది.
వ్యక్తిగత కారణాలతో సైన్యానికి వీడ్కోలు..12 ఏళ్ల సైనిక సేవ అనంతరం మేజర్ రిషభ్ సింగ్ ముందస్తు పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగత, కుటుంబపరమైన బాధ్యతల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆయన రిటైర్మెంట్‌పై రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక వివరణ వెలువడలేదు. దీంతో ఆయన నిర్ణయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















