అమెరికాలో మెరుపు వరదలు.. 20 మందికి పైగా గల్లంతు!నేపాల్‌లో చోటుచేసుకున్న ప్రకృతి వైపరీత్యంతో ప్రపంచం దిగ్భ్రాంతికి గురవుతున్న వేళ.. అమెరికాలోనూ ప్రకృతి ప్రకోపించింది. ఆరిజోనా రాష్ట్రంలోని గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్క్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ మెరుపు వరదల్లో 20 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో 15 మంది వరకు పర్వతారోహకులు ఉన్నట్లు సమాచారం.
బ్రైట్ ఏంజెల్ కాన్యన్, ఫాంటమ్ రాంచ్ ప్రాంతాలు మునకగ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్క్‌లోని బ్రైట్ ఏంజెల్ కాన్యన్, ఫాంటమ్ రాంచ్ ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరద ఉద్ధృతికి భారీ బండరాళ్లు, లోహపు నిర్మాణాలు కొట్టుకుపోయి కొలరాడో నదిలో కలిసినట్లు నేషనల్ పార్క్ సర్వీస్ వెల్లడించింది.
గల్లంతైన వారి కోసం గాలింపువరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆరిజోనా రాష్ట్ర అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టినట్లు నేషనల్ పార్క్ సర్వీస్ తెలిపింది. సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా..కొలరాడో నదిలో కలిసే బ్రైట్ ఏంజెల్ క్రీక్‌లో శనివారం మధ్యాహ్నం ఈ ఆకస్మిక వరద ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. కొద్దిసేపట్లోనే నీటి ప్రవాహం భారీగా పెరగడంతో పరిసర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరదల ఉద్ధృతికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















