కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ యశ్.. ప్రస్తుతం పాన్ ఇండియా కథానాయకుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై వచ్చిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా యశ్ తల్లి పుష్ప చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తన కుమారుడి ఎదుగుదలను కొందరు ఓర్చుకోలేకపోతున్నారని ఆమె అన్నారు.
‘కేజీఎఫ్’కు ముందు యశ్ ఎవరు? అనే వ్యాఖ్యలపై ఆమె పేరు ప్రస్తావించకుండానే ఘాటుగా స్పందించారు. కేజీఎఫ్‌కు ముందు తన కుమారుడు కన్నడలో వరుసగా ఐదు విజయాలు అందుకున్నాడని గుర్తుచేశారు. ఒకవేళ యశ్ అంతగా గుర్తింపు లేని నటుడైతే.. ఇప్పుడు అతడిని అందరూ ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు.
‘‘నా కుమారుడు ఉగ్రవాదేం కాదు. అతడు అందరిలా ధనిక కుటుంబంలో పుట్టలేదు. ఒక బస్ డ్రైవర్ కొడుకు. తన సొంత కృషితో ఈ స్థాయికి ఎదిగాడు. ఒక తల్లిగా నా కుమారుడిని చూసి గర్వపడుతున్నాను’’ అని పుష్ప వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
యశ్ సాధించిన పాన్ ఇండియా స్టార్‌డమ్ ఒక్కరోజులో వచ్చినది కాదని ఆమె స్పష్టం చేశారు. ‘కేజీఎఫ్’కు ముందు నుంచే కన్నడ చిత్ర పరిశ్రమలో యశ్ ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారని, ఆ కష్టానికి ‘కేజీఎఫ్’ విజయంతో ఫలితం దక్కిందని పేర్కొన్నారు. చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టి తన ప్రతిభ, కృషితో యశ్ ఈ స్థాయికి చేరుకున్నారని తెలిపారు.
అయితే పుష్ప తన వ్యాఖ్యల్లో ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. గతంలో నిర్మాత అల్లు అరవింద్ ‘కేజీఎఫ్’కు ముందు యశ్ ఎవరు? అన్న తరహాలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ప్రస్తుతం యశ్ తల్లి చేసిన వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యశ్ కూడా ఈ అంశంపై స్పందించారు. ఒక సినిమా విజయం కేవలం హీరో లేదా హీరోయిన్ వల్లే సాధ్యం కాదని, దర్శకుడు, సాంకేతిక నిపుణులు, ఇతర నటీనటులు సహా ఎంతో మంది కృషి ఉంటుందని చెప్పారు. అదే సమయంలో ప్రధాన పాత్రలో నటించే వ్యక్తి తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించకపోతే సినిమా విజయవంతం కావడం కష్టమని అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















