అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-ఇన్ సర్వీస్ టీచర్స్-2026) నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, ఎయిడెడ్ తదితర పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు అర్హులు. అలాగే ఏపీఆర్‌ఈఐఎస్/ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం
ఏపీ స్పెషల్ టెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు నిర్దేశిత కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. బీసీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 40 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు.
దరఖాస్తు ఫీజు
అభ్యర్థులు ప్రతి పేపర్‌కు రూ.1,000 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులను సెప్టెంబరు 24 వరకు సమర్పించవచ్చు. ఏపీ స్పెషల్ టెట్-2026 పరీక్షలను అక్టోబరు 11 నుంచి 21 వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష విధానం, పేపర్ల వివరాలు, ఇతర మార్గదర్శకాలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించి.. గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















