ఈ రెండు సంక్షేమ పథకాల అమలుపై సింగిల్ బెంచ్ విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు సీజే ధర్మాసనం రద్దు చేసింది. దీంతో పథకాల అమలుకు మార్గం సుగమమైంది.
పథకాల అమలుపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
2014 నుంచి రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్ వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలు చేశారని ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పథకాల అమలు వల్ల పిటిషనర్‌కు ఎలాంటి ప్రత్యక్ష నష్టం జరగడం లేదని, ఆయన హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా పిటిషనర్ ఈ పథకాల లబ్ధిదారు కూడా కాదని వాదించారు.
ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని, ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన అంశాలను ఈ విధంగా సవాల్ చేయలేరని ఏజీ పేర్కొన్నారు. షాదీ ముబారక్ తరహా సంక్షేమ పథకాలను సుప్రీంకోర్టు అనుమతించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అదే విధంగా కల్యాణలక్ష్మి పథకం కూడా సంక్షేమ లక్ష్యంతో అమలు చేస్తున్నదేనని వివరించారు.
పిటిషన్ సింగిల్ జడ్జి వద్ద విచారణార్హం కాదని, ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై విచారణ జరిపే పరిధి డివిజన్ బెంచ్‌కు ఉందని ఏజీ వాదించారు. ఈ నేపథ్యంలో పథకాల అమలుపై విధించిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని ధర్మాసనాన్ని కోరారు.
ఏజీ వాదనలతో ఏకీభవించిన సీజే ధర్మాసనం.. సింగిల్ బెంచ్ విధించిన స్టేను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై నెలకొన్న తాత్కాలిక అడ్డంకి తొలగినట్లైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















