బెంగళూరు (గ్రామీణం), హిందూపురం, న్యూస్‌టుడే: ఒక కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడాయి. ఏడాది వ్యవధిలో ముగ్గురు పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన జాకీర్, సుమేరా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. గత ఏడాది కుమారుడు రెహాన్ చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందాడు. అప్పటి నుంచి ఆ దంపతులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు.
కుమారుడిని కోల్పోయిన బాధ నుంచి పూర్తిగా కోలుకోకముందే మరో విషాదం వారి కుటుంబాన్ని కుదిపేసింది. తమ ఇద్దరు కుమార్తెలు రహిలాభాను (13), రాకియా ఖురత్ (8)లను కంటికి రెప్పలా చూసుకుంటూ వారిలోనే తమ ప్రపంచాన్ని వెతుక్కుంటున్నారు. అయితే విధి మరోసారి ఆ కుటుంబంపై పగబట్టినట్లుగా వ్యవహరించింది.
ఆదివారం సెలవు కావడంతో ఇద్దరు చిన్నారులు తమ అమ్మమ్మ ఇర్ఫానా (46)తో కలిసి కర్ణాటకలోని దొడ్డబళ్లాపురంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. బంధువులతో కొంత సమయం గడిపిన అనంతరం సోమవారం తిరిగి హిందూపురం వెళ్లేందుకు బయలుదేరారు.
ముత్తూరు వైపు నుంచి రైల్వేస్టేషన్‌కు చేరుకునే క్రమంలో మలుపు వద్ద పట్టాలు దాటుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అదే సమయంలో వచ్చిన రైలు ముగ్గురినీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రహిలాభాను, రాకియా ఖురత్, ఇర్ఫానా అక్కడికక్కడే మృతి చెందారు.
ఒక్కసారిగా ఇద్దరు కుమార్తెలను, తల్లిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇప్పటికే కుమారుడిని కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు ఇద్దరు కుమార్తెలను కూడా దూరం చేసిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఏడాది వ్యవధిలో ముగ్గురు పిల్లలను కోల్పోయిన జాకీర్, సుమేరా కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















