అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ టెక్నాలజీస్ ఉద్యోగుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సంస్థలో ఉద్యోగాల కోత చేపట్టిన ఉబర్.. తాజాగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మరింత కఠినతరం చేసింది. ఇకపై కేవలం 1 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే పూర్తిస్థాయి రిమోట్ వర్క్ సదుపాయం కల్పించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.
కార్పొరేట్ ఉద్యోగులు ఇకపై వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయం నుంచి పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రిమోట్‌గా పనిచేస్తున్న ఉద్యోగులు తమ బృందాలతో సమన్వయంగా పనిచేసేందుకు సంబంధిత ప్రాంతాలకు మారాలని సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి సిబ్బందికి పంపిన ఇ-మెయిల్లో సూచించారు.
ఉద్యోగుల కోసం న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కోలో ప్రత్యేక కార్యాలయ హబ్‌లను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. మేనేజర్లు, వారి కింద పనిచేసే ఉద్యోగులు ఒకే ప్రాంతంలో ఉండేలా పని విధానాన్ని మార్చాలని ఉబర్ భావిస్తోంది.
ఇటీవల గ్లోబల్ సిబ్బందిలో దాదాపు 10 శాతం ఉద్యోగాలను ఉబర్ తొలగించింది. ఈ చర్యలో సుమారు 3,300 మంది కార్పొరేట్ ఉద్యోగులపై ప్రభావం పడింది. మేనేజ్మెంట్లోని అనవసరమైన స్థాయిలను తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని కంపెనీ పేర్కొంది.
అదే సమయంలో రైడ్ షేరింగ్, డెలివరీ, రోబోట్యాక్సీ వంటి కీలక వ్యాపార విభాగాల్లో పెట్టుబడులను సమీక్షిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే తాజా వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనలు కార్పొరేట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. డ్రైవర్లు, ఇతర సిబ్బందిపై ఈ నిర్ణయం ప్రభావం ఉండదని ఉబర్ స్పష్టం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















