టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీబిజీగా మారనుంది. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ అనంతరం ఆసియా క్రీడలు, వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లలో భారత జట్టు పాల్గొననుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.
న్యూజిలాండ్‌తో టీమిండియా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్‌లో జరిగే తొలి టీ20తో భారత జట్టు పర్యటన ప్రారంభం కానుంది. రెండో టీ20 కూడా క్రైస్ట్‌చర్చ్‌లోనే జరగనుంది.
2019 తర్వాత తొలిసారి భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుండటంతో ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి అనుగుణంగానే మ్యాచ్‌ల టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణ ప్రజలకు టికెట్ల విక్రయాలు ప్రారంభమైన కొద్దిసేపటికే పలు మ్యాచ్‌ల టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
క్రైస్ట్‌చర్చ్‌లో భారత్‌తో జరిగే రెండో టీ20 టికెట్లలో ఇప్పటికే 75 శాతం అమ్ముడైనట్లు బోర్డు తెలిపింది. అక్టోబర్ 30న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగే నాలుగో టీ20కి మరింత భారీ డిమాండ్ కనిపిస్తోంది. దీంతో స్టేడియంలోని ఆరో అంచె సీటింగ్‌ను తొలిసారిగా తెరవాల్సిన పరిస్థితి ఏర్పడిందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది.
టీమిండియా న్యూజిలాండ్ పర్యటన షెడ్యూల్
- అక్టోబర్ 22 – తొలి టీ20 – క్రైస్ట్‌చర్చ్
- అక్టోబర్ 24 – రెండో టీ20 – క్రైస్ట్‌చర్చ్
- అక్టోబర్ 27 – మూడో టీ20 – వెల్లింగ్టన్
- అక్టోబర్ 30 – నాలుగో టీ20 – ఆక్లాండ్
- నవంబర్ 1 – ఐదో టీ20 – హామిల్టన్
ఐదు వన్డేల సిరీస్
- నవంబర్ 4 – తొలి వన్డే – ఆక్లాండ్
- నవంబర్ 7 – రెండో వన్డే – వెల్లింగ్టన్
- నవంబర్ 10 – మూడో వన్డే – హామిల్టన్
- నవంబర్ 13 – నాలుగో వన్డే – మౌంట్ మౌంగనుయి
- నవంబర్ 15 – ఐదో వన్డే – మౌంట్ మౌంగనుయి
రెండు టెస్టుల సిరీస్
- నవంబర్ 19–23 – తొలి టెస్టు – వెల్లింగ్టన్
- నవంబర్ 27–డిసెంబరు 1 – రెండో టెస్టు – క్రైస్ట్‌చర్చ్
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















