వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. అదే సమయంలో ఒడిశా–పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాల వెంబడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో మంగళ, బుధవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కోస్తా జిల్లాలతో పాటు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. వర్షాల సమయంలో పిడుగులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం కాని సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల వద్ద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

















