బిహార్‌లో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలు అంశం ఎన్డీయే కూటమిలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో యూసీసీని అమలు చేసేందుకు తాము అంగీకరించబోమని జేడీయూ సీనియర్ నేత శ్యామ్ రజక్ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో యూసీసీ బిల్లుకు మద్దతు తెలిపినప్పటికీ.. రాష్ట్ర స్థాయిలో అమలు విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.
యూసీసీపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఇప్పటికే స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని శ్యామ్ రజక్ పేర్కొన్నారు. 2029 నాటికి ఎన్డీయే పాలిత 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు.
బిహార్‌లో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ.. అది మిత్రపక్షాల మద్దతుతో నడుస్తోందని శ్యామ్ రజక్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి భాజపాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ, యూసీసీ విషయంలో జేడీయూ వైఖరి మాత్రం స్పష్టంగా ఉందన్నారు. రాష్ట్రంలో యూసీసీ అమలు చేసే అంశమే తమ దృష్టిలో లేదని పునరుద్ఘాటించారు.
ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ కూడా భాజపాపై విమర్శలు చేసింది. రాజకీయంగా ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో భాజపా మరోసారి విద్వేష రాజకీయాలను తెరపైకి తీసుకొస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి శక్తి యాదవ్ ఆరోపించారు. బిహార్ ప్రజల లౌకికవాద వైఖరిని భాజపా గుర్తుంచుకోవాలని అన్నారు.
రాష్ట్రంలో యూసీసీ అమలుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామని ఆర్జేడీ స్పష్టం చేసింది. దీంతో యూసీసీ అంశం బిహార్‌లో రాజకీయంగా మరోసారి వేడిని పెంచే అవకాశముంది. అధికార కూటమిలోని జేడీయూ వ్యతిరేకత, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ అంశంపై భాజపా ఎలా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















