. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రీ లేఔట్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఒక దశలో గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
మైత్రీ లేఔట్లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం వద్ద తెదేపా నాయకుడు పుష్పనాథరెడ్డి, తెలుగుయువత జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కులుగారి విజయ్‌కుమార్‌రెడ్డి మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. విగ్రహం వద్దకు పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి బీటెక్ రవి, ఆయన భార్య, జడ్పీటీసీ సభ్యురాలు లతారెడ్డి, వేముల మండల తెదేపా నాయకుడు పార్థసారథిరెడ్డిని పుష్పనాథరెడ్డి ఆహ్వానించి సన్మానించారు.
వారు అక్కడి నుంచి వెళ్లిన అనంతరం తనకు ఎందుకు శాలువా కప్పలేదని, లడ్డూ వేలంలో పాల్గొనకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని విజయ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అనంతరం పుష్పనాథరెడ్డి తన అనుచరులతో కలిసి విజయ్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో కర్రలు, రాళ్లతో ఇంటి అద్దాలతో పాటు ఆయన స్కార్పియో వాహనం అద్దాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. వివాదాన్ని పరిష్కరించేందుకు అక్కడికి చేరుకున్న హజ్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ మహబూబ్ బాషా, తెదేపా నాయకుడు నల్లగారి భాస్కర్‌రెడ్డికి చెందిన వాహనాల అద్దాలు కూడా ధ్వంసమైనట్లు తెలిసింది.
ఇంట్లోకి రాళ్లు విసురుతున్న పరిస్థితిని గమనించిన మహబూబ్ బాషా గన్‌మన్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో అక్కడున్న వారు చెల్లాచెదురయ్యారు.
సమాచారం అందుకున్న డీఎస్పీ మురళీనాయక్, పులివెందుల రూరల్ సీఐ శాంతిలాల్, ఎస్సై మధుసూదన్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. పుష్పనాథరెడ్డితో పాటు మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు అపస్మారక స్థితిలోకి వెళ్లిన విజయ్‌కుమార్‌రెడ్డిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఇరువర్గాలకు చెందిన ముఖ్య నాయకులను పోలీసులు విచారిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















