పైలట్ల భద్రతపై ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు లేఖ రాసింది. పైలట్లకు తప్పనిసరిగా విశ్రాంతి కల్పించేందుకు రూపొందించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలు అమల్లోకి రాకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఇటీవల విధుల్లో ఉండగానే పలువురు పైలట్లు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ సమస్య మరింత తీవ్రతరమైందని అసోసియేషన్ తెలిపింది. విమాన భద్రత, సిబ్బంది శ్రేయస్సు విషయంలో తక్షణ చర్యలు అవసరమని పేర్కొంది.
గతంలో అనేకసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ, పైలట్లకు అవసరమైన విశ్రాంతి కల్పించే నిబంధనలను నిరంతరం వాయిదా వేయడం వల్ల సమస్యలు పెరిగాయని అసోసియేషన్ ఆరోపించింది. ఎయిర్‌లైన్ సంస్థలకు మినహాయింపులు ఇవ్వడం వల్ల FDTL నిబంధనలు నీరుగారుతున్నాయని పేర్కొంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సడలింపుల కారణంగా పైలట్లు మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపింది. అందువల్ల వెంటనే FDTL నిబంధనలను అమలు చేయడానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని డీజీసీఏను కోరింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















