కాంగ్రెస్ పార్టీ నాయకుడు పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యపై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అస్సాం సీఎం సతీమణి రిణికి భూయాన్ శర్మకు సంబంధించి పలు పాస్‌పోర్టులు, విదేశీ ఆస్తులు ఉన్నాయంటూ పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలపై ఆమె ఫిర్యాదు చేయడంతో గువాహటిలో కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన గువాహటి హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ అభ్యర్థన తిరస్కరించబడింది. దీంతో పవన్ ఖేరా సుప్రీంకోర్టును సంప్రదించారు. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి, తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులు విధించింది.
విచారణకు సహకరించాలని, అవసరమైనప్పుడు పోలీసుల ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అలాగే సాక్ష్యాలను తారుమారు చేయరాదని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. అవసరమైతే అదనపు షరతులు విధించే స్వేచ్ఛ ట్రయల్ కోర్టుకు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















