మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నేతలు సమన్వయంతో ముందుకెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్ వ్యూహం, ఇతర కీలక అంశాలపై కాంగ్రెస్ ముఖ్యనేతలు, మంత్రులతో సీఎం జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డీసీసీ అధ్యక్షులు, మంత్రులు పాల్గొన్నారు.పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అక్కడ పోలింగ్ శాతం పెంచేందుకు స్పష్టమైన వ్యూహం అమలు చేయాలని సూచించారు. స్థానిక నేతల నాయకత్వంలో సమర్థవంతమైన పోల్ మేనేజ్‌మెంట్ జరగాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
ప్రతి ఓటరూ తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలన్నారు. ఇందుకోసం ఇవాళ, రేపు పార్టీ నేతలు ఓటర్లకు అందుబాటులో ఉండి, వారితో నేరుగా సంప్రదింపులు జరపాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగితేనే పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయని సీఎం స్పష్టం చేశారు.ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా జరగాలంటే పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని, చివరి ఓటరు వరకూ చేరుకునేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















