కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, వాతావరణ అవాంతరాల మధ్య ఈ ఏడాది అమరనాథ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. “హర హర మహాదేవ్” నినాదాలతో బయల్దేరిన భక్తులు తొలి రోజే మంచు శివలింగ దర్శనం పొందారు. జమ్మూకశ్మీర్లోని హిమాలయాల్లో ప్రతి సంవత్సరం ఏర్పడే ఈ మంచు లింగాన్ని దర్శించేందుకు శుక్రవారం ఒక్కరోజే సుమారు 12 వేల మంది భక్తులు పాల్గొన్నారు.
నువ్వాన్, బాల్టాల్ బేస్ క్యాంపుల నుంచి గురు, శుక్రవారాల్లో రెండు వేర్వేరు బృందాలుగా యాత్ర ప్రారంభమైంది. తొలి రోజు దర్శనం పొందినవారిలో 9,350 మంది పురుషులు, 2,250 మంది మహిళలు, 200 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భక్తులకు ‘ఎక్స్’ వేదికగా రెండు పేజీల లేఖ రాశారు. యాత్రలో భాగంగా ఐదు ప్రతిజ్ఞలను పాటించాలని సూచించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం, జమ్మూకశ్మీర్ స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం (వోకల్ ఫర్ లోకల్), ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, పర్యావరణ సంరక్షణలో భాగంగా రక్షాబంధన్ రోజున మొక్కలు బహుమతిగా ఇవ్వడం, “దేశం ప్రథమం” అనే భావనతో యాత్ర కొనసాగించాలని ఆయన కోరారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews














