అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తొలిసారి స్పందించింది. ఈ ఘటనను అసాధారణమైనదిగా పరిగణించాలని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే పేర్కొన్నారు. దోషులుగా తేలిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
కోట్ల మంది భక్తుల త్యాగాలతో నిర్మితమైన అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం ఘటన సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని, రామభక్తుల విశ్వాసానికి పెద్ద దెబ్బ అని ఆయన అన్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిట్ దర్యాప్తు కొనసాగుతూ నిందితులను గుర్తించి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆరెస్సెస్ ఆకాంక్షించింది. అలాగే ఆలయ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సూచించింది.
దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో హిందూ సమాజం సంయమనం పాటించాలని హోసబలే విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని హిందూ ధర్మం, హిందూ సమాజాన్ని అపఖ్యాతిపాలు చేసే శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కీలక సమావేశం ఈ నెల 6న జరగనుంది. ఈ సమావేశంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఐదేళ్ల ఆర్థిక లావాదేవీలపై సిట్ మరింత లోతైన దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















