పశ్చిమ బెంగాల్‌లో జరిగిన తొలి దశ ఎన్నికల పోలింగ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సంకేతమని ఆయన అన్నారు.
కోల్‌కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన అమిత్ షా, “దీదీ దిగిపోయే సమయం వచ్చేసింది” అంటూ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. తొలి దశలో పోటీ చేసిన 152 సీట్లలో 110కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బెంగాల్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని అభివృద్ధికి మద్దతు ఇస్తున్నారని, రాష్ట్రంలో మార్పు అనివార్యమని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, దోపిడీకి ముగింపు పలుకుతామని హామీ ఇచ్చారు.
అలాగే చొరబాటు రహిత బెంగాల్, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. బెంగాల్ ముఖ్యమంత్రి గురించి వ్యాపిస్తున్న వదంతులపై కూడా ఆయన స్పందిస్తూ, రాష్ట్ర నాయకత్వం స్థానికంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















