వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం మండలం టి.కోడూరులో రూ.3 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఎస్‌ఏఈఎల్ సోలార్ ప్రాజెక్టును విద్య, ఐటీ శాఖ మంత్రి Nara Lokesh ప్రారంభించారు. 2,400 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ ద్వారా 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో వెయ్యికి పైగా మందికి ఉపాధి లభించగా, అందులో 80 శాతం మంది స్థానిక యువతే ఉండటం విశేషం. దీర్ఘకాలిక లీజుల ద్వారా 760 రైతు కుటుంబాలకు స్థిరమైన ఆదాయం అందనున్నట్లు మంత్రి తెలిపారు.రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్, సాఫ్ట్‌వేర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పెట్టుబడులకు తాను ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే ఉంటానని పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు.
వైకాపాపై విమర్శలు గుప్పించిన లోకేశ్, “మా బ్రాండ్ ఉద్యోగాల కల్పన.. మీ బ్రాండ్ గొడ్డలి” అంటూ మాజీ సీఎం Y. S. Jagan Mohan Reddyపై ఎద్దేవా చేశారు.అనంతరం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు మునగాల ద్వారకానాథరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న విధానాన్ని ప్రశంసించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















