సెమీ కండక్టర్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0ను బలోపేతం చేయడానికి దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, చిప్ దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ కోరారు. కొరియా పర్యటనలో భాగంగా దక్షిణ కొరియాలోని భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ఏపీలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, మౌలిక సదుపాయాలను వివరించారు. శ్రీసిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో రెడీ టు యూజ్ ఇండస్ట్రియల్ క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇవి అంతర్జాతీయ కంపెనీల అవసరాలకు అనుగుణంగా వేగంగా పెట్టుబడులు ప్రారంభించేందుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
కొరియా–ఏపీ అనుసంధానానికి భాగంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని మంత్రి సూచించారు. తిరుపతి ఐఐటీ, శ్రీసిటీ ట్రిపుల్ ఐటీ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో కలిసి సంయుక్త శిక్షణ, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఇది చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో నైపుణ్య వనరులను అందుబాటులోకి తీసుకువస్తుందని పేర్కొన్నారు.
కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ 2026 ఏప్రిల్‌లో భారత్ పర్యటనకు రానున్న నేపథ్యంలో, ప్రతిపాదిత కొరియా ఎన్‌క్లేవ్ ఏర్పాటుకు వేగంగా కార్యరూపం ఇవ్వాలని మంత్రి అభ్యర్థించారు. అలాగే కొరియా చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం శ్రీసిటీలో ప్లగ్ అండ్ ప్లే టౌన్‌షిప్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
అదేవిధంగా కొరియా ప్రాధాన్య పరిశ్రమలను ఏపీకి తీసుకొచ్చే దిశగా సహకరించాలని ఆయన కోరారు. సముద్ర తీర ప్రాంతాల్లో హెచ్‌డీ హ్యూందాయ్ తరహాలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్, బ్యాటరీ తయారీ యూనిట్లు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
కొరియా ప్లస్, కేఓటీఆర్‌ఏ, భారత్–కొరియా పారిశ్రామిక సహకార కమిటీలను అనుసంధానిస్తూ ఏపీ–కొరియా డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే ఈ నెల 10న సియోల్‌లో నిర్వహించనున్న ఇన్వెస్టర్ రోడ్‌షో, జీ2జీ ఒప్పందాలకు కొరియా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఈ చర్చలు కీలకమని అధికారులు పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















