రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల విద్యుత్ సరఫరా దెబ్బతింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పరిస్థితిపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అత్యవసర సమీక్ష నిర్వహించారు.విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి సమస్య ఉందో నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పనులు ఆలస్యమవుతున్నప్పటికీ, మధ్యాహ్నంలోగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తెగిపోయిన విద్యుత్ తీగల దగ్గరకు వెళ్లరాదని హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలపై అవగాహన సందేశాలు పంపాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే 1912 టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
విజయవాడలో విద్యుత్ తీగ తెగిపడి హోంగార్డు మృతి చెందడం పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.ఉభయగోదావరి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని అధికారులు తెలిపారు. ఇంకా మిగిలిన కొన్ని గ్రామాల్లో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని, మధ్యాహ్నంలోగా పూర్తి చేస్తామని వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















