ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ పాలసీ-2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో భారీ స్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.
రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం వంటి రంగాల్లో పీపీపీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రూ.1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,500 కోట్ల స్టేట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) కేటాయించారు. ఆర్థికంగా ప్రారంభ దశలో బలహీనంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఆదాయం సమకూర్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.
ప్రాజెక్టుల ప్రణాళిక, ఆర్థిక అంచనా, టెండర్ల ప్రక్రియ, అమలు, పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేట్ రంగ పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యాలను వినియోగించుకుని మెరుగైన ప్రజా సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















