గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన Rajasekhar ఆదివారం 44 ఏళ్ల సుదీర్ఘ పోలీసు సేవ అనంతరం ఉద్యోగవిరమణ పొందారు. సాధారణంగా పదవీవిరమణ రోజున జరిగే వీడ్కోలు సభలు, కుటుంబ సమావేశాలకు భిన్నంగా ఆయన చేసిన చర్య అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
62 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్ పట్ల తనకున్న నిబద్ధతను చూపిస్తూ, 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్‌పై వరుసగా 62 రౌండ్లు పరిగెత్తారు. ఈ సందర్భంగా అక్కడి సహచరులు, గుంటూరు జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఆయనను సత్కరించి అభినందించారు. దీర్ఘకాలిక సేవతో పాటు క్రీడా స్పూర్తిని కూడా సమానంగా కొనసాగించిన ఆయన తీరు అందరిలో ప్రశంసలు పొందింది.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, “పదవీవిరమణ అనేది నా ఉద్యోగానికే కానీ నాకు కాదు. ఇది నా కొత్త క్రీడా జీవితానికి ఆరంభం. ఇంకా సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి” అని తెలిపారు. విధుల్లో ఉన్న రోజుల్లో రోజుకు సుమారు 10 కిలోమీటర్లు, అవకాశం ఉన్న రోజుల్లో 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు పరుగెత్తేవాడినని ఆయన పేర్కొన్నారు.
ఆయన నిబద్ధత, క్రమశిక్షణ, ఫిట్‌నెస్ పట్ల ఉన్న అభిరుచి యువ పోలీస్ సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తోందని సహచరులు అభిప్రాయపడ్డారు. పదవీవిరమణను ముగింపుగా కాకుండా కొత్త ఆరంభంగా చూడాలన్న ఆయన ఆలోచన పలువురిని ఆకట్టుకుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















