ఇరాన్ బహిష్కృత యువరాజు రెజా పహ్లవీపై జర్మనీ రాజధాని బెర్లిన్‌లో దాడి ఘటన కలకలం సృష్టించింది. ఫెడరల్ న్యూస్ కాన్ఫరెన్స్ భవనంలో మీడియా సమావేశం ముగించుకుని బయటకు వస్తుండగా ఓ వ్యక్తి ఆయనపై ఎరుపు రంగు ద్రావణం చల్లాడు.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో పహ్లవీకి ఎటువంటి గాయాలు కాలేదు. వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమికంగా అది టమాటా రసం అయ్యి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.
ఈ ఘటన తర్వాత పహ్లవీ మద్దతుదారులు జర్మనీ పార్లమెంట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇరాన్ రాజకీయ పరిస్థితులపై పహ్లవీ చేసిన వ్యాఖ్యల తర్వాతే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌ను విడిచి వెళ్లిన పహ్లవీ, అప్పటి షా మహమ్మద్ రెజా పహ్లవీ కుమారుడు. ప్రస్తుతం ఆయన ఇరాన్‌లో పాలన మార్పు కోసం అంతర్జాతీయ మద్దతు కోరుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















