బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఛైర్మన్ మనన్‌కుమార్ మిశ్రపై మరోసారి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బీసీఐలో ఆర్థిక అవకతవకలు, అనుమానాస్పద నియామకాలు చోటుచేసుకున్నాయని కౌన్సిల్ కో-ఛైర్మన్ వై.ఆర్. సదాశివరెడ్డి ఆరోపించారు. కౌన్సిల్ అనుమతి లేకుండా బంధువులు, వ్యక్తిగత సంబంధాలు ఉన్నవారికి నియామకాలు చేపట్టారని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో 15 రోజుల్లోగా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలపై చర్చించేందుకు బీసీఐ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సదాశివరెడ్డి కోరారు. నిధుల నిర్వహణ, నియామకాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, సమగ్ర ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ ట్రస్ట్‌కు రూ.150 కోట్ల బదిలీ?
బీసీఐ ట్రస్ట్ కార్యకలాపాలను మనన్‌కుమార్ మిశ్ర అడ్డుకున్నారని సదాశివరెడ్డి ఆరోపించారు. దాని స్థానంలో 2020లో ‘బీసీఐ ట్రస్ట్ పెరల్ ఫస్ట్’ పేరుతో కొత్త ట్రస్ట్‌ను నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బీసీఐ నిధుల నుంచి రూ.150 కోట్లను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేసేందుకు తీర్మానం ప్రవేశపెట్టారని ఆరోపించారు.
బీసీఐ గుర్తింపు, పునరుద్ధరణ కోరే కొన్ని న్యాయ కళాశాలలను ట్రస్ట్‌కు విరాళాలు ఇవ్వాలని కోరేవారని కూడా సదాశివరెడ్డి ఆరోపించారు. బీసీఐకి చెందిన చట్టబద్ధమైన నిధులను ప్రైవేట్ ట్రస్ట్‌కు బదిలీ చేయడానికి ప్రయత్నించిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు.
నియామకాలపైనా ఆరోపణలు :
బీసీఐ సిబ్బందిలో అధిక శాతం మంది మనన్‌కుమార్ మిశ్ర కుటుంబ సభ్యులు లేదా ఆయనతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నవారేనని సదాశివరెడ్డి ఆరోపించారు. వారి నియామకాలను సమర్థించే ఎంపిక కమిటీ వివరాలు, మెరిట్ జాబితాలు, సంబంధిత రికార్డులు కౌన్సిల్ వద్ద లేవని పేర్కొన్నారు.
నిధుల బదిలీలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పూర్తి రికార్డులను పరిశీలించేందుకు స్వతంత్ర ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ నిర్వహించి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















