మంగళవారం దిల్లీలో ఆరంభం కానున్న బిల్లీ జీన్ కింగ్ టెన్నిస్ టోర్నీలో ఆసియా-ఓసియానియా గ్రూప్-1 పోటీల్లో భారత్ ప్లే ఆఫ్స్ బెర్త్ సాధన కోసం బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్‌లో భారత్ థాయ్‌లాండ్‌తో తలపడనుంది.ఈ కప్‌లో ఇండోనేషియా, మంగోలియా, న్యూజిలాండ్, కొరియా కూడా పాల్గొంటున్నారు. టోర్నీ రౌండ్-రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతుంది. టాప్-2లో నిలిచే జట్లు వచ్చే ఏడాది ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్స్ కోసం అర్హత సాధిస్తాయి.
భారత్ బరిలోకి దిగకముందే టీమ్ ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న తెలంగాణ యువ కెరటం శ్రీవల్లి రష్మిక వెన్ను గాయంతో పోటీ నుంచి వైదొలిగింది. ఆమె స్థానంలో జీల్ దేశాయ్ జట్టులోకి చేరారు.2025 ఆసియా-ఓసియానియా టోర్నీలో భారత్ మూడో స్థానంలో నిలిచడంతో ప్లే ఆఫ్స్ బెర్త్ కోల్పోయింది. ఈసారి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరడానికి జట్టు ధ్యాస పెట్టింది. సహజ యమలపల్లి, అంకిత రైనా, జీల్ దేశాయ్, వైష్ణవి అద్కర్, రుతుజ బోస్లే జట్టులో ఉన్నారు. భారత జట్టుకు విశాల్ ఉప్పల్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
కోచ్ విశాల్ ఉప్పల్ మాట్లాడుతూ, “ఆసియాలో టాప్ జట్లతో పోటీపడబోతున్నాం. ప్రతి మ్యాచ్ సవాల్‌తో ఉంటుంది. రష్మిక గాయం కారణంగా ఆమె స్థానాన్ని జీల్ దేశాయ్‌తో భర్తీ చేశాం. సహజ, అంకిత, వైష్ణవిపై మా ఆశలు ఉన్నాయి” అని చెప్పారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















