ఏలూరు జిల్లాలో అంధురాలైన కుమార్తెతో పాటు ఆమె తల్లి దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన గంటా అంతూబాయి (60), రామారావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమార్తె మద్దా వెంకటలక్ష్మి (46) అంధురాలు. ఆమె ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ఏలూరులోనే తల్లి, అంధుడైన సోదరుడు నాగబాబుతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
గత నెల 29న బంధువుల పుట్టినరోజు వేడుకల కోసం తల్లి–కుమార్తె తూర్పుగోదావరి జిల్లా దూబచర్లకు వెళ్లారు. ఆ తరువాత నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు.
ఈ క్రమంలో ఉంగుటూరు మండలం నల్లమాడు సమీపంలోని జీడితోటలో ఇద్దరి మృతదేహాలు కుళ్లిన స్థితిలో గుర్తించారు. తోట యజమాని సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతదేహాల తలలపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
వెంకటలక్ష్మి భర్త సుదర్శనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















