దేశీయ స్టాక్ మార్కెట్లో ఇటీవల ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్) విధానం కొనసాగుతుందని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. ఈ విధానాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన లేదని, మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయాలు, సమస్యలను పరిశీలిస్తున్నామని తెలిపారు. అవసరమైతే తగిన మార్పులు చేపడతామని పేర్కొన్నారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఈ నెల 3 నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త విధానంపై పలువురు ట్రేడర్లు, విశ్లేషకులు సోషల్ మీడియాలో కొన్ని సమస్యలను ప్రస్తావించారు.
సీఏఎస్ స్టాక్ మార్కెట్లో కీలక సంస్కరణ అని పాండే అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విమర్శకు వెంటనే స్పందించలేమని, అయితే మార్కెట్ భాగస్వాములతో చర్చిస్తూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్త విధానంపై అవగాహన పెంచుకోవాలని మార్కెట్ భాగస్వాములకు సూచించారు.
అంతర్జాతీయ మార్కెట్లలో ఇలాంటి విధానాలు ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్నాయని, భారత్‌లో దీని అమలులో కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. కొత్త విధానం వల్ల కలిగే ప్రయోజనాలను మదుపరులు, మార్కెట్ భాగస్వాములు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















