దగ్గు మందులు, ఇతర సిరప్‌ల అమ్మకాలను మరింత కఠినతరం చేసేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇకపై దగ్గు సిరప్‌లు కొనుగోలు చేయాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు 1,000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో కొన్ని రకాల దగ్గు మందులను లైసెన్స్ లేని దుకాణాల్లో కూడా విక్రయించేందుకు అనుమతి ఉండేది. అయితే తాజాగా ఆ మినహాయింపును తొలగిస్తూ, ఇకపై కేవలం లైసెన్స్ ఉన్న ఫార్మసీల ద్వారానే సిరప్‌ల అమ్మకాలు జరగనున్నట్లు కేంద్రం తెలిపింది.
ఈ నిర్ణయం రోగుల భద్రతను మెరుగుపరచడం, సిరప్‌ల వినియోగాన్ని పర్యవేక్షించడం, నాణ్యతా ప్రమాణాలు కాపాడడం లక్ష్యంగా తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఔషధాల తయారీదారులు, పంపిణీదారులు, రిటైలర్లు తప్పనిసరిగా ఈ కొత్త మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించింది.
కల్తీ సిరప్‌ల కారణంగా వివిధ దేశాల్లో చిన్నారుల మరణాలు చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















