జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కాళేశ్వర క్షేత్రం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. శృంగేరి పీఠాధిపతి విదుశేఖర భారతీతీర్థ స్వామి అనుమతితో ఆలయ పునర్నిర్మాణాలకు రూపకల్పన చేసినట్లు ఆయన వెల్లడించారు.
బుధవారం ఉదయం 8.15 గంటలకు నిర్మాణాల తొలగింపు పూజలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ధార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి కాళేశ్వరం ఈవో కార్యాలయంలో అర్చకులు, స్థానికులు, పాలకవర్గ సభ్యులతో ఆలయ పునర్నిర్మాణాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వర క్షేత్ర అభివృద్ధికి రూ.198 కోట్లు, పూర్వం నాటి అష్టతీర్థాల అభివృద్ధికి రూ.60 కోట్లు మంజూరు చేసినట్లు కమిషనర్ తెలిపారు. రాతి కట్టడాల నిర్మాణాలతో ఆలయ ఆవరణ మరింత విశాలంగా మారనుందని వెల్లడించారు.
ఆలయ ఆవరణలో సుమారు 25 వేల మంది భక్తులు ఒకేసారి ఉండేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాలకు ఒక నెల ముందుగానే పనులు పూర్తి చేసి క్షేత్రాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కమిషనర్ హనుమంతరావు పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















