తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా పండితుల వేద ఆశీర్వచనాలతో ఆయన కొత్త బాధ్యతలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలూ శ్రమిస్తానని పేర్కొన్నారు. నేరాల స్వరూపం మారుతోందని, కొత్త టెక్నాలజీ ద్వారా నేరగాళ్లు మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఇది పోలీసులకు పెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ పోలీస్ బృందం మంచి పని చేస్తోందని ప్రశంసించారు.
శాంతిభద్రతల సమస్యలు రాకముందే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆధునిక టెక్నాలజీ వినియోగంతో పోలీస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ గతంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ఆయన 2028 జూన్ వరకు డీజీపీగా కొనసాగనున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















