రాష్ట్రంలో ఎండలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో తాగునీటి సంక్షోభం మరింత పెరిగింది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇళ్ల ముందు డ్రమ్ములు, బిందెలు పెట్టుకుని నీటి సరఫరా కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులకు ఒకసారి నీరు వస్తుందని చెప్పినా, అది కూడా సమయానికి అందడం లేదు. మిషన్ భగీరథ పథకం పలు చోట్ల పూర్తి స్థాయిలో అమలుకాక ప్రజలకు తాగునీటి సమస్య కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో పైపులు వేసినప్పటికీ నీరు రావడం లేదు. వచ్చిన చోట కలుషిత నీరు వస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో 4వ వార్డు సహా పలు కాలనీల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. మంజీరా నీటి సరఫరా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. నీటి కోసం పనులు మానుకుని ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం బల్దియాలో కూడా నీటి సమస్య తీవ్రమైంది. భగీరథ నీరు అవసరానికి తగినంతగా రావడం లేదు. కొన్ని కాలనీల్లో ట్యాంకర్ నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జహీరాబాద్ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో 15 రోజులుగా నీటి సరఫరా లేని పరిస్థితి నెలకొంది. మంజీర నదిలో నీటిమట్టం తగ్గడంతో ఇన్‌టేక్ వెల్‌ల ద్వారా నీరు సరఫరా చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి.మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్య ప్రజల దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















