Cyient Semiconductors భారత సెమీకండక్టర్ రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. గ్లోబల్ టెక్నాలజీ సంస్థ Navitas Semiconductor సహకారంతో భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన గాలియం నైట్రైడ్ (GaN) పవర్ ఐసీలను హైదరాబాద్‌లో ఆవిష్కరించింది.భారత్‌లో వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చిన తొలి గాన్ పవర్ ఐసీ ఉత్పత్తులు ఇవేనని సంస్థ వెల్లడించింది. 650 వోల్ట్స్ సామర్థ్యంతో పనిచేసే ఏడు అత్యాధునిక పరికరాలను తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ ఉత్పత్తులను జూన్ నెల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ గాన్ పవర్ ఐసీలు ఎడ్జ్ ఏఐ, ఇ-మొబిలిటీ, ఏఐ డేటా సెంటర్లు, టెలికమ్యూనికేషన్స్, ఫాస్ట్ ఛార్జింగ్, పారిశ్రామిక పవర్ సిస్టమ్స్ వంటి రంగాల్లో పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు రూపొందించబడ్డాయి.గత ఏడాది డిసెంబర్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం న్యావిటాస్ పరికరాల సరఫరాను కూడా చేపట్టనున్నట్లు సైయెంట్ సెమీకండక్టర్స్ సీఈఓ Suman Narayan తెలిపారు. భారత్ న్యావిటాస్ 2.0 వ్యూహంలో కీలక మార్కెట్ అని సంస్థ సీఈఓ, ప్రెసిడెంట్ Chris Allexandre పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















