డీఎంకే ఒక దుష్టశక్తి, అన్నాడీఎంకే బలహీనమైన శక్తి అని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ముఖ్యమంత్రిగా ఎదగకుండా అడ్డుకోవడానికి ఈ రెండు పార్టీలు విశ్వప్రయత్నం చేశాయని ఆయన ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అందులో తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి ఇటీవల రాజీనామా చేసిన ఆయన, తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సోమవారం తిరుచ్చికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, తాను ధరించే నలుపు, తెలుపు కోటు ప్రత్యేక సంకేతమని తెలిపారు. సచ్చమైన మనసుకు ప్రతీకగా ఈ రంగులను ఎంచుకున్నానని, అన్ని విషయాల్లోనూ బ్లాక్ అండ్ వైట్ విధానాన్ని అనుసరిస్తానని ఆయన చెప్పారు.
తమిళనాడులో లంచం పూర్తిగా నిర్మూలించడమే తన ప్రధాన లక్ష్యమని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో మరోసారి చర్చలు వేడెక్కాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















