భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆస్ట్రేలియా ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ సోమవారం దిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, పారిశ్రామిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నేతలు నొక్కి చెప్పారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల చమురు సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతున్న నేపథ్యంలో, అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావం పెరుగుతున్న పరిస్థితుల్లో స్వేచ్ఛాయుత నౌకాయానం, విమానయానం, నిరాటంక సముద్ర వాణిజ్యం ప్రాధాన్యతను ఇరు పక్షాలు గుర్తుచేశాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సురక్షిత నౌకాయానం కోసం ఇప్పటికే సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు, భవిష్యత్ సహకార ప్రణాళికకు తుదిరూపు ఇవ్వడానికి అవసరమైన చర్యలపై చర్చలు కొనసాగినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.
రక్షణ రంగ సహకారాన్ని మరింత విస్తరించే దిశగా రక్షణ సామగ్రి, సేవలకు సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని (MoU) అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ ఒప్పందం ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















