ఇటీవలి కాలంలో క్యాన్సర్ అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ప్రతి సంవత్సరం దేశంలో 14 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ప్రాసెస్ చేసిన ఆహారం, నిద్రలేమి వంటి కారణాలు ఈ వ్యాధి పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకోని వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెళ్లయిన వారితో పోలిస్తే ఎక్కువగా ఉండవచ్చని ఆ అధ్యయనం సూచిస్తోంది. ముఖ్యంగా పెళ్లికాని మహిళల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉన్నట్లు తేలింది
అధ్యయనం ఏమి చెబుతోంది?
‘క్యాన్సర్ రీసెర్చ్ కమ్యూనికేషన్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో 10 కోట్ల మందికి పైగా డేటాను విశ్లేషించారు. ఇందులో పెళ్లి అయిన వారితో పోలిస్తే పెళ్లికాని వారికి క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 2015 నుంచి 2022 మధ్య 40 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులను పరిశీలించారు. 30 ఏళ్లు పైబడిన వయోజనులపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఇందులో పెళ్లికాని పురుషులు, మహిళల్లో క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. పురుషుల్లో సుమారు 70 శాతం వరకు ప్రమాదం ఎక్కువగా ఉండగా, మహిళల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
ఏ క్యాన్సర్ల ప్రమాదం ఎక్కువ?
పరిశోధన ప్రకారం పెళ్లికాని పురుషుల్లో అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదం 2.5 రెట్లు ఎక్కువగా ఉంది. పెళ్లికాని మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రమాదం 3 రెట్లు ఎక్కువగా ఉంది. HPV వైరస్ వంటి ఇన్ఫెక్షన్లు కూడా కొన్ని క్యాన్సర్లకు కారణమవుతాయి. నిపుణుల ప్రకారం వివాహం నేరుగా క్యాన్సర్‌ను నివారించదు. కానీ వివాహితులు సాధారణంగా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకర జీవనశైలి పాటించడం వంటి కారణాల వల్ల వారికి ముందస్తుగా వ్యాధి గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణం ఆలస్యంగా గుర్తించడం అని నిపుణులు చెబుతున్నారు. కుటుంబ మద్దతు ఉన్నవారు వైద్య పరీక్షలు త్వరగా చేయించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతో వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి చికిత్స చేయడం సాధ్యమవుతుంది. పెళ్లికాని వ్యక్తుల్లో ఈ మద్దతు కొంత తగ్గే అవకాశం ఉండటంతో, కొన్ని సందర్భాల్లో వ్యాధి ఆలస్యంగా గుర్తిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. వైవాహిక స్థితి క్యాన్సర్‌కు ప్రత్యక్ష కారణం కాదు. కానీ జీవనశైలి, ఆరోగ్యంపై శ్రద్ధ వంటి అంశాల ద్వారా పరోక్షంగా ప్రభావం చూపవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. అందువల్ల ఎవరైనా సరే ఆరోగ్యకర జీవనశైలి పాటించడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















