బంగారం ధరలు
- 24 కే బంగారం: సుమారు ₹15,840 / గ్రా
- 22 కే బంగారం: సుమారు ₹14,520 / గ్రా
- 18 కే బంగారం: సుమారు ₹11,880 / గ్రా
- 10 గ్రా 24 కే ధర: సుమారు ₹1,58,400
- 10 గ్రా 22 కే ధర: సుమారు ₹1,45,200
వెండి ధరలు
- వెండి: సుమారు ₹300 / గ్రా
- 10 గ్రా వెండి: సుమారు ₹3,000
- 1 కిలో వెండి: సుమారు ₹2,99,900
బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల (తులం) మేలిమి బంగారం ధర రూ.1.50 లక్షలకు పైగా ఉండగా, భవిష్యత్తులో ఇది రూ.1 లక్ష లోపునకు రావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర ప్రస్తుతం 5,000 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, 3,000 డాలర్ల వరకు పడిపోవచ్చని విశ్లేషిస్తున్నారు.
డాలర్ బలోపేతమే కీలకం
రష్యా తిరిగి అమెరికా డాలర్లలో వాణిజ్యాన్ని ప్రారంభిస్తే, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లలో డాలర్ బలపడే అవకాశం ఉంది. అప్పుడు పెట్టుబడులు బంగారం నుంచి డాలర్ మరియు అమెరికా బాండ్ల వైపు మళ్లవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం, భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయ అనిశ్చితులు పెరగడంతో బంగారంపై పెట్టుబడులు పెరిగాయి.గతేడాది కాలంలో బంగారం ధరలు 70% కంటే ఎక్కువ పెరిగాయి. ఒక దశలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1.80 లక్షలకు పైగా చేరింది. అయితే ప్రస్తుతం రూ.1.59 లక్షల వద్ద ఉంది. ఇదే విధంగా అంతర్జాతీయంగా ఔన్సు ధర 5,600 డాలర్లను తాకి, ఇప్పుడు 5,000 డాలర్ల వద్దకు చేరింది.
బ్రిక్స్ దేశాల ప్రభావం
ప్రపంచ పసిడి నిల్వల్లో సుమారు 20% బ్రిక్స్ దేశాల వద్దే ఉంది. అంతర్జాతీయ ఉత్పత్తిలో కూడా ఈ దేశాల వాటా దాదాపు 50%. ఈ దేశాలు బంగారం నిల్వలను పెంచుకోవడంతో సరఫరా తగ్గి, ధరలు పెరిగాయి. అయితే రష్యా డాలర్ వాణిజ్యాన్ని పునరుద్ధరించుకుంటే బ్రిక్స్ దేశాల ప్రత్యామ్నాయ కరెన్సీ ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది.
మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, అంతర్జాతీయంగా ఔన్సు ధర 2027 నాటికి 3,000 డాలర్లకు దిగిరాగలదు. అదే జరిగితే దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.90,000 నుంచి రూ.1,00,000 మధ్య స్థిరపడే అవకాశం ఉందని చెబుతున్నారు.అయితే, ఈ అంచనాలు అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, యుద్ధ పరిణామాలు, కేంద్ర బ్యాంకుల విధానాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బంగారం ధరల్లో మార్పులు ఎప్పటికప్పుడు గ్లోబల్ మార్కెట్ ధోరణులకే అనుసంధానమై ఉంటాయని గుర్తు చేస్తున్నారు.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews EmergencyResponse Entertainment Geopolitics governance Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow



















