ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. సన్నకారు రైతులు, మహిళా రైతులకు ఉపయోగపడేలా ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, టిల్లర్లను పంజాబ్‌కు చెందిన సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిమ్రి) అభివృద్ధి చేసింది.
దేశవ్యాప్త రోడ్‌షోలలో భాగంగా హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ)లో ఈ-ట్రాక్టర్, ఎలక్ట్రిక్ టిల్లర్ల ప్రదర్శన నిర్వహించారు. రైతులకు వీటి పనితీరును సిమ్రి శాస్త్రవేత్తలు వివరించారు.‘సీఎస్‌ఐఆర్-ప్రైమా ఈటీ11’ పేరుతో రూపొందించిన ఈ-ట్రాక్టర్ 26 హెచ్‌పీ సామర్థ్యంతో పనిచేస్తుంది. 1.5 టన్నుల బరువును మోయగలిగే ఈ ట్రాక్టర్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు నాలుగున్నర గంటల పాటు పనిచేస్తుంది. ఎకరాకు రూ.100లోపే ఖర్చుతో వ్యవసాయ పనులు పూర్తి చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పొలం దున్నడం, చదును చేయడం వంటి అన్ని పనులకు ఇది ఉపయోగపడుతుంది.
అలాగే చిన్న కమతాల రైతుల కోసం రూపొందించిన ఎలక్ట్రిక్ టిల్లర్ రోటవేటర్, రిడ్జర్, వాటర్ పంప్ వంటి పరికరాల పనులు కూడా చేయగలదు. డీజిల్ ఖర్చులో 85 శాతం వరకు ఆదా అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంజిన్ ఆయిల్, ఫిల్టర్లు, గేర్‌బాక్స్ అవసరం లేకపోవడంతో నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి.ఈ కొత్త ఎలక్ట్రిక్ వ్యవసాయ యంత్రాలు భవిష్యత్తులో రైతులకు భారీగా ఉపయుక్తం కానున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















