వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్రంగా సమీక్షించారు. ఫీడర్ కాలువ లైనింగ్ పనులు, టన్నెల్ తవ్వకాలు, సైడ్ వాల్ నిర్మాణాలు వంటి కీలక అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు లక్ష్యాలను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
నల్లమల సాగర్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే దిశగా మూడు గ్యాప్‌లను ఫిల్ చేసి రిజర్వాయర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా 53.83 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందని వివరించారు. ఫ్లడ్ సీజన్ ప్రారంభానికి ముందే ఫీడర్ కాలువ పనులు పూర్తి చేసి, 45 రోజుల్లో 45 టీఎంసీల మేర నీటిని డ్రా చేసి నల్లమల సాగర్‌ను నింపేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
టన్నెల్ పనుల్లో మిగిలిన బెంచింగ్, కాంక్రీట్ లైనింగ్ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. రెండో సొరంగంలో మిగిలిన భాగాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి, ప్రాజెక్టు మొత్తాన్ని సమయానికి పూర్తి చేయాలన్నారు.స్థానిక చెరువులు, కంబం చెరువు వంటి నీటి వనరులను నింపేలా అనుసంధాన వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిర్మాణ పనులను రూ.400 కోట్లతో చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు.
వెలిగొండ టన్నెల్ పనులు పూర్తయ్యాక పోరుమామిళ్ల, రాచర్ల ప్రాంతాలకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పురోగతిని నిరంతరం తనకు తెలియజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.రైతుల ఆశలను నెరవేర్చే దిశగా ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని, భూగర్భజలాల పెరుగుదలతో పాటు సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews Entertainment Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews



















