చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్‌ఫెనిరమైన్ మేలియేట్, ఫినైలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ అనే రెండు రసాయనాలతో కూడిన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మందుల తయారీ, విక్రయాలు, పంపిణీపై ఆంక్షలు విధించింది. నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ మందులను ఉపయోగించరాదని స్పష్టం చేసింది.
కేంద్రం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ రెండు రసాయనాలు కలిగిన అన్ని రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మందులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఇకపై సంబంధిత ఔషధాల తయారీదారులు లేబుల్, ప్యాకేజీ ఇన్‌సర్ట్, ప్రచార సామగ్రిపై స్పష్టమైన హెచ్చరికలను తప్పనిసరిగా ముద్రించాలి. నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ మందులను ఉపయోగించరాదనే విషయాన్ని వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.
నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (DTAB) చేసిన సిఫారసుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కాంబినేషన్ మందుల వినియోగం వల్ల చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇదే సమయంలో పిల్లలకు అందుబాటులో ఉన్న సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించవచ్చని తెలిపింది.
ఇప్పటికే ఈ రెండు రసాయనాలతో కూడిన కొన్ని ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మందులపై కేంద్రం చర్యలు తీసుకుంది. 2025 ఏప్రిల్ 15న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నిర్దిష్ట కాంబినేషన్ మందులపై ఆంక్షలు విధించడంతో పాటు.. నాలుగేళ్లలోపు పిల్లలకు వాటిని ఉపయోగించరాదనే హెచ్చరికను తప్పనిసరి చేసింది.
అయితే తాజా నిర్ణయంతో ఈ నిబంధనలను మరింత విస్తరించారు. క్లోర్‌ఫెనిరమైన్ మేలియేట్, ఫినైలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ కలిగిన అన్ని ఫార్ములేషన్లకు ఈ ఆంక్షలు వర్తించేలా చేశారు. ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం, 1940లోని సెక్షన్ 26A కింద ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ప్రచురితమైన తేదీ నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చిన్నారులకు ఏదైనా మందు ఇచ్చే ముందు వైద్యుల సలహా తీసుకోవడం, మందుల లేబుల్‌పై ఉన్న వయస్సు సంబంధిత హెచ్చరికలను పరిశీలించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















