విశాఖపట్నం ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కేవలం ఆటలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పెదగదిలి కొండవాలు ప్రాంతానికి చెందిన డోల అజిత్ (23) అనే డిగ్రీ విద్యార్థి, క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో ప్రత్యర్థి చేతిలో కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం అజిత్ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న సమయంలో గొడవ జరిగింది. అయితే, ఈ వివాదానికి పాత కక్షలు కూడా తోడయ్యాయి. గత వారం జరిగిన పోలమాంబ పండగలో నిందితుడు కిషోర్, అజిత్ స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న కిషోర్, ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మద్యం మత్తులో పెదగదిలి కూడలి వద్ద అజిత్‌తో మళ్ళీ గొడవకు దిగాడు. మాటా మాటా పెరగడంతో వెంట తెచ్చుకున్న కత్తితో అజిత్‌ను విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.
తీవ్ర రక్తస్రావమైన అజిత్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. ఉన్నత చదువులు చదువుతూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువకుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో పెదగదిలి ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నిందితుడు కిషోర్ ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















