పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. ముడి చమురు ధరలు భారీగా పెరిగి 100 డాలర్ల మార్కును దాటడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. దీనికి తోడు ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో బుధవారం దేశీయ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి.
ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ గత ముగింపు 75,577.58 పాయింట్లతో పోలిస్తే 75,216.22 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. చివరకు 813.35 పాయింట్లు కోల్పోయి 74,764.23 వద్ద స్థిరపడింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా భారీ నష్టాలను చవిచూసింది. సూచీ 203.60 పాయింట్లు పతనమై 23,431.50 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, ముడి చమురు ధరల పెరుగుదల దేశీయ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
సెన్సెక్స్ 30లోని పలు ప్రముఖ షేర్లు నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. వీటితో పాటు హెచ్డీఎఫ్సీ, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు కూడా నష్టపోయాయి.
అయితే కొన్ని షేర్లు మార్కెట్ పతనాన్ని కొంతమేర అడ్డుకున్నాయి. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ట్రెంట్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 100.60 డాలర్ల వద్ద కొనసాగింది. చమురు ధరలు మరింత పెరిగితే దిగుమతులపై ఆధారపడే భారత్‌పై ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్, కంపెనీల నిర్వహణ వ్యయాల పరంగా ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర 4,391.07 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.11గా నమోదైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















