భారతీయ స్టాక్ మార్కెట్లలో యువత భాగస్వామ్యం వేగంగా పెరుగుతోంది. త్వరగా ఆర్థిక స్వేచ్ఛ సాధించాలనే లక్ష్యంతో 30 ఏళ్లలోపు వారు పెద్ద సంఖ్యలో మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం కొత్త రిటెయిల్ మదుపరుల సగటు వయసు గతంలో 29 ఏళ్లు ఉండగా.. ప్రస్తుతం 27 ఏళ్లకు తగ్గింది. మార్కెట్‌లోకి వస్తున్న కొత్త మదుపరుల్లో దాదాపు 60 శాతం మంది 30 ఏళ్లలోపు వారే.
చిన్న వయసులోనే పెట్టుబడులు ప్రారంభించడం మంచి అలవాటే. దీర్ఘకాలిక పెట్టుబడులకు యువతకు ఉన్న సమయం, నష్టాలను కొంతవరకు భరించే సామర్థ్యం ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఈ అవకాశాలను అధిక రిస్క్ ఉన్న క్రిప్టో ఆస్తులు, బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి వాటిలో వినియోగిస్తే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పెట్టుబడికి, ఊహాగానాలకు మధ్య ఉన్న తేడాను యువత స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
పెట్టుబడులు పెట్టేటప్పుడు మొత్తం సొమ్మును ఒకే షేరు లేదా ఒకే పథకంలో పెట్టకుండా వివిధ ఆస్తుల్లో విభజించడం మంచిది. ఈక్విటీలు, డెట్ సాధనాలు, బంగారం వంటి విభిన్న మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్‌ను సమతుల్యం చేసుకోవచ్చు. తక్కువ పొదుపు ఉన్నవారు దీర్ఘకాలిక లక్ష్యాలతో ఇండెక్స్ ఫండ్లు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లలో ఎస్‌ఐపీ వంటి మార్గాలను పరిశీలించవచ్చు.
స్టాక్ మార్కెట్‌లో రాత్రికి రాత్రే సంపద సృష్టించడం సాధ్యం కాదు. క్రమశిక్షణతో, దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు కొనసాగించడం ముఖ్యం. ఎవరో చెప్పారని షేర్లు కొనడం కాకుండా.. కంపెనీ ఆర్థిక పరిస్థితి, వ్యాపార నమూనా, ఆదాయాలు, అప్పులు, భవిష్యత్ అవకాశాలను పరిశీలించాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే షార్ట్ వీడియోలు లేదా ఉచిత టిప్స్‌ను మాత్రమే ఆధారంగా చేసుకుని పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దు.
అలాగే అప్పు చేసి షేర్లలో పెట్టుబడి పెట్టడం, అవగాహన లేకుండా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేయడం వంటి అధిక రిస్క్ చర్యలకు దూరంగా ఉండాలి. మార్కెట్‌లో హెచ్చుతగ్గులు సహజమే కాబట్టి.. తాత్కాలిక మార్పులకు భయపడి దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికను మధ్యలో ఆపకూడదు. పెట్టుబడులతో పాటు అత్యవసర నిధి, ఆరోగ్య బీమా, జీవిత బీమా వంటి ఆర్థిక భద్రతా అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















