నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. అత్తాపూర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. శనివారం ఉదయం నుంచే జేసీబీల సహాయంతో ఈ డ్రైవ్ ప్రారంభించారు.
పిల్లర్ నంబర్ 116 నుంచి 252 వరకు ఫుట్‌పాత్‌లపై నిర్మించిన అనధికార కట్టడాలను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించడమే ఈ చర్యల లక్ష్యమని తెలిపారు.
ఇటీవలి కాలంలో ఫుట్‌పాత్ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించిన జీహెచ్‌ఎంసీ అధికారులు, ప్రతి శనివారం క్రమం తప్పకుండా కూల్చివేత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలో పాదచారుల భద్రత, ట్రాఫిక్ సౌలభ్యం కోసం ఈ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















