మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో సంచలన బ్యాంక్ దోపిడి చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు సాయుధ దుండగులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖను టార్గెట్ చేసి భారీగా నగదు, నగలు దోచుకుని పరారయ్యారు. మొత్తం రూ.35 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలను దుండగులు అపహరించినట్లు ప్రాథమిక సమాచారం.ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం, మొదట ఇద్దరు వ్యక్తులు సాధారణ కస్టమర్ల మాదిరిగా బ్యాంకులోకి ప్రవేశించారు. కొద్దిసేపటికి వారు తుపాకులు బయటకు తీసి అక్కడున్న సిబ్బంది, వినియోగదారులను బెదిరించారు. ఇదే సమయంలో మరో ముగ్గురు సాయుధులు బ్యాంకులోకి దూసుకెళ్లి పరిస్థితిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
దుండగులు గాల్లో కాల్పులు జరుపుతూ భయాందోళన సృష్టించారు. అనంతరం బ్యాంక్ మేనేజర్‌ను బెదిరించి లాకర్ల తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేనేజర్ నిరాకరించడంతో అతనిపై దాడి చేసి బలవంతంగా తాళాలు లాక్కొన్నారు. అనంతరం లాకర్లు తెరిచి నగదు, నగలను సేకరించి కేవలం 20 నిమిషాల్లోనే అక్కడి నుంచి పరారయ్యారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బ్యాంక్‌లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. దుండగులు ముందుగా ప్రణాళిక వేసుకుని ఈ దోపిడికి పాల్పడ్డారని అధికారులు అనుమానిస్తున్నారు.ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన నెలకొంది. బ్యాంక్ భద్రతా వ్యవస్థపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















