మలేరియా నివారణ కోసం పంపిణీ చేసిన క్లోరోక్విన్ మాత్రలు వికటించాయన్న అనుమానంతో పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాత్రలు తీసుకున్న ఓ ఏడేళ్ల చిన్నారి మృతి చెందగా.. మరో 53 మంది అస్వస్థతకు గురయ్యారు.
మంగళవారం వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి మలేరియా నివారణ చర్యల్లో భాగంగా 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు అందించారు. పాఠశాలల్లో విద్యార్థులతోనూ మాత్రలు మింగించారు. అనంతరం గ్రామానికి చెందిన మడివి జమున (7) ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు చేసుకుంది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను లక్ష్మీపురం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
జమున మూడు క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన అనంతరం గ్రామంలోని పాఠశాల, అంగన్‌వాడీ చిన్నారులు, ఇతరులు అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 53 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అస్వస్థతకు గురైన వారిలో 46 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని కలెక్టర్ దినేష్‌కుమార్ వెల్లడించారు.
ఘటనకు అసలు కారణాలను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాజమహేంద్రవరం, కాకినాడ, పాడేరు, విజయవాడ నుంచి ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను గ్రామానికి పంపిస్తున్నారు. మాత్రల పంపిణీ, వాటి వినియోగం, అస్వస్థతకు దారితీసిన పరిస్థితులపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
గొల్లగుప్ప ఘటనపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఘటనకు గల కారణాలను వెలికితీయడంతో పాటు బాధితులకు మెరుగైన వైద్యం, అవసరమైన సహాయ చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















