దౌత్యం, భౌగోళిక రాజకీయాలను ఎల్లప్పుడూ త్వరిత ఫలితాల కోణంలో అంచనా వేయలేమని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. కొన్ని అంతర్జాతీయ సవాళ్ల పరిష్కారానికి సహనం, దీర్ఘకాలిక నిబద్ధత అవసరమని పేర్కొన్నారు. ‘ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత దౌత్యనీతి టీ20 క్రికెట్‌ను పోలి ఉందా? అన్న ప్రశ్నకు స్పందించిన జైశంకర్.. అంతర్జాతీయ సంబంధాలు సుదీర్ఘమైన, అనిశ్చిత ప్రక్రియలతో కూడుకున్నవని వివరించారు. భౌగోళిక రాజకీయ సమస్యలకు ప్రభుత్వాలు, మీడియా త్వరిత పరిష్కారాలను ఆశిస్తుంటాయని.. అయితే వాస్తవ పరిష్కారాలు సుదీర్ఘకాలంలో రూపుదిద్దుకుంటాయని అన్నారు.
మీడియాకు స్వల్పకాలిక పరిణామాలను అందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. వాస్తవ ప్రపంచంలో టెస్ట్ మ్యాచ్‌లూ ఉంటాయని జైశంకర్ పేర్కొన్నారు. వాటి ఫలితాలు తక్కువ సమయంలో తేలవని వివరించారు. పశ్చిమాసియా యుద్ధం తొలుత టీ20 మ్యాచ్‌లా ఉంటుందని భావించినప్పటికీ.. అది టెస్ట్ సిరీస్ కంటే ఎక్కువ కాలం సాగే ప్రక్రియగా మారిందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత అనిశ్చిత ప్రపంచంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసు సమస్యలు, మార్కెట్ అంతరాయాలను ఎదుర్కొనేందుకు వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని జైశంకర్ సూచించారు.
అంతరాయాల నుంచి తమను తాము కాపాడుకోవడమే ప్రాధాన్య అంశంగా ఉండాలని, ‘డీ-రిస్కింగ్’ తన అతిపెద్ద మంత్రమని పేర్కొన్నారు. ఎక్కువ మంది భాగస్వాములు, మరిన్ని సరఫరా వనరులపై ఆధారపడాలని సూచించారు. ఎన్ని ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉంటే అంత భద్రత ఉంటుందని తెలిపారు.
ప్రపంచ మార్కెట్లు తరచూ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావానికి లోనవుతాయని గుర్తించాలన్నారు. ఇంధనం, ఎరువులు, రవాణా వంటి రంగాలు ఇందుకు ఉదాహరణలని చెప్పారు. అంతరాయాలు ఎప్పుడైనా ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేసి ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పెట్టుబడులకు భద్రత కల్పించడంతో పాటు సరఫరా వనరుల్లో వైవిధ్యం పాటించాలని జైశంకర్ అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















