రోజురోజుకూ కృత్రిమ మేధ (Artificial Intelligence) అన్ని రంగాల్లోకి వేగంగా విస్తరిస్తూ ప్రజల జీవితంలో కీలక భాగంగా మారుతోంది. చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినై, గ్రోక్ వంటి ఏఐ టూల్స్ ప్రస్తుతం మెయిల్స్ రాయడం, డాక్యుమెంట్లను విశ్లేషించడం, సమాచారం సేకరించడం వంటి అనేక పనుల్లో సహాయపడుతున్నాయి. అయితే ఇవి కేవలం ఆరంభ దశ మాత్రమేనని గూగుల్ ఎక్స్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేసిన మొ గావ్‌డాట్ హెచ్చరించారు.
ఈ సాంకేతికత భవిష్యత్తులో పరిశ్రమల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందని, అనేక రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. సమాజ నిర్మాణమే పూర్తిగా మారిపోవచ్చని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ అత్యంత శక్తివంతంగా మారేందుకు మానవాళికి కేవలం మూడేళ్ల సమయం మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాలను ఆయన ‘ది డైరీ ఆఫ్ ఏ సీఈఓ’ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.
ఏఐ స్వయంగా ప్రమాదాలను సృష్టించదని, కానీ దాన్ని కంపెనీలు, ప్రభుత్వాలు ఎలా ఉపయోగిస్తాయన్నదే అసలైన కీలక అంశమని గావ్‌డాట్ స్పష్టం చేశారు. ఇప్పటికే చాట్‌బాట్లు, వీడియో జనరేషన్ టూల్స్ ద్వారా ఏఐ ప్రజల జీవితంలో భాగమైందని, అయితే నిజమైన పరిణామాలు ప్రయోగశాలల లోపలే జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
సిస్టమ్‌లు ఇప్పుడు సొంతంగా కోడ్‌ను మెరుగుపరుచుకుంటూ, మార్పులను పరీక్షిస్తూ, వేగంగా కొత్త వెర్షన్లను విడుదల చేస్తున్నాయని ఆయన వివరించారు. ప్రజల అవగాహనకు, వాస్తవ సామర్థ్యానికి మధ్య ఉన్న అంతరం వల్లే రాబోయే మార్పుల తీవ్రతను చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారని మొ గావ్‌డాట్ అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















